Share News

Rain Alerts In Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్..

ABN , Publish Date - Sep 11 , 2025 | 07:57 PM

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి 7.00 నుంచి 10.00 గంటల వరకూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.

Rain Alerts In Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్..

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ (గురువారం) రాత్రి 7.00 నుంచి 10.00 గంటల వరకూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ (Orange Warning), ఎల్లో అలర్ట్స్ (Yellow Warning) జారీ చేసింది.


ఆదిలాబాద్, హన్మకొండ, జగిత్యాల, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2 నుంచి 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఒకటి రెండు చోట్ల.. మోస్తరు వర్షం కురిసే అవకాశమని తెలిపింది.


భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో తదుపరి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.


ఇవి కూడా చదవండి

నేపాల్‌లో ఆందోళనలు.. చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు

ఏపీలో మళ్లీ ఐఏఎస్‌లు బదిలీ..

For TG News And Telugu News

Updated Date - Sep 11 , 2025 | 08:59 PM