Share News

IAS Transfers: ఏపీలో మళ్లీ ఐఏఎస్‌లు బదిలీ..

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:54 PM

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 11 మంది సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో 12మందిని వివిధ జిల్లాల కలెక్టర్లుగా నియమించింది.

IAS Transfers: ఏపీలో మళ్లీ ఐఏఎస్‌లు బదిలీ..

అమరావతి, సెప్టెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈసారి 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సోమవారం అంటే.. ఆగస్టు 8వ తేదీన రాష్ట్రంలోని 11 మంది సీనియర్ ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మూడ్రోజుల వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేయడం గమనార్హం. అయితే ఈసారి ఈ బదిలీ ప్రక్రియలో పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది ఏపీ సర్కార్.


ఆ జిల్లాల కలెక్టర్లుగా..

  • పార్వతీపురం మన్యం కలెక్టర్‌: ప్రభాకర్‌ రెడ్డి

  • విజయనగరం కలెక్టర్‌: రామసుందర్‌రెడ్డి

  • తూర్పుగోదావరి కలెక్టర్‌: కీర్తి చేకూరి

  • గుంటూరు కలెక్టర్‌: తమీమ్‌ అన్సారియా

  • పల్నాడు కలెక్టర్‌: కృతిక శుక్లా

  • బాపట్ల కలెక్టర్‌: వినోద్‌ కుమార్‌

  • ప్రకాశం కలెక్టర్‌: రాజాబాబు

  • నెల్లూరు కలెక్టర్‌: హిమాన్షు శుక్లా

  • అన్నమయ్య కలెక్టర్‌: నిషాంత్‌ కుమార్‌

  • కర్నూలు కలెక్టర్‌: ఎ.సిరి

  • అనంతపురం కలెక్టర్‌: ఆనంద్‌

  • సత్యసాయి కలెక్టర్‌: శ్యాంప్రసాద్‌


ఇవి కూడా చదవండి

నేపాల్‌లో ఆందోళనలు.. చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు

పెండింగ్ బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం.. తీర్పు రిజర్వు చేసిన సుప్రీంకోర్టు

For More AP News and Telugu News..

Updated Date - Sep 11 , 2025 | 09:22 PM