Sridhar Babu Visits Victoria Parliament: తెలంగాణ రోల్ మోడల్ రాష్ట్రం.. విక్టోరియా ప్రతినిధుల ప్రశంసలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:11 PM
పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలంటే పౌరుల భాగస్వామ్యం కీలకమని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీ ఆధారిత, పౌర కేంద్రిత పాలన వైపు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: ఆస్ట్రేలియాలో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా విక్టోరియా పార్లమెంట్‌ను (Victoria Parliament) మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబుకు లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ లీ తార్లామిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్ ఘన స్వాగతం పలికారు. శాసన ప్రక్రియలు, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీపై సుదీర్ఘంగా చర్చించారు.
పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలంటే పౌరుల భాగస్వామ్యం కీలకమని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీ ఆధారిత, పౌర కేంద్రిత పాలన వైపు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ – విక్టోరియా ఇన్‌స్టిట్యూషనల్ కొలాబరేషన్ పెంచేందుకు చొరవ చూపుతామని మంత్రి తెలిపారు. అలాగే తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనీషియేటివ్స్‌ను విక్టోరియా ప్రతినిధులకు మంత్రి వివరించారు.
ఇక... రాష్ట్రంపై విక్టోరియా నేతలు ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రోల్ మోడల్ రాష్ట్రం అంటూ కొనియాడారు. ద్వైపాక్షిక సహకారం పెంపొందించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా విక్టోరియా ప్రతినిధులు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
పండగ కోసం వచ్చి ప్రమాదంలో మృతి.. పటాన్‌చెరులో విషాదఛాయలు
బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..
Read Latest Telangana News And Telugu News