Share News

TG Panchayat Elections: ముగిసిన మలివిడత పోలింగ్.. ఇక కౌంటింగ్ షురూ.!

ABN , Publish Date - Dec 14 , 2025 | 01:51 PM

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి.

TG Panchayat Elections: ముగిసిన మలివిడత పోలింగ్.. ఇక కౌంటింగ్ షురూ.!
Telangana Local Body Elections

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది(Telangana Local Body Elections). మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియాల్సి ఉండగా.. అప్పటికే క్యూలో నిల్చున్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి సాయంత్రానికి ఫలితాలు వెల్లడికానున్నాయి(Telangana Polls).


ఈ ఎన్నికల్లో అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు మినహా.. పోలింగ్ అంతా సజావుగా సాగినట్టు తెలుస్తోంది. మొత్తం 4,236 పంచాయతీలు; 29,917 వార్డు సభ్యుల పదవులకు ఓటింగ్ జరిగింది. ఇందుకోసం 12,782 మంది సర్పంచ్ అభ్యర్థుల బరిలో నిలవగా.. 71,071 మంది వార్డు సభ్యులు పోటీచేశారు(Panchayat Polls).


ఇవీ చదవండి:

మెస్సితో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకం: సీఎం రేవంత్‌రెడ్డి

పుస్తక మహోత్సవ ప్రాంగణానికి అందెశ్రీ పేరు

Updated Date - Dec 14 , 2025 | 01:52 PM