Share News

CM Revanth Reddy:హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసడర్లుగా మారండి..

ABN , Publish Date - May 12 , 2025 | 02:12 PM

CM Revanth Reddy:హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్ రంగంలో, లైఫ్ సైన్సెస్‌ రంగంలో ఇంకా అనేక రంగాల్లో జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కు హబ్‌గా మారిందని, అలాగే AI-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, HCL టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయని అన్నారు.

CM Revanth Reddy:హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసడర్లుగా మారండి..
CM Revanth Reddy..

హైదరాబాద్: నానక్ రామ్ గూడ (Nanakramguda)లో సొనాటా సాఫ్ట్ వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ (Sonata Software New Facility Center)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy), మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించుకున్న సందర్భంగా యాజమాన్యం, ఉద్యోగులు అందరికీ శుభాభినందనలు తెలిపారు. సొనాటా సాఫ్ట్‌వేర్ అత్యాధునిక AIని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమన్నారు.


నెంబర్ 1 రాష్ట్రంగా...

హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్ రంగంలో, లైఫ్ సైన్సెస్‌ రంగంలో ఇంకా అనేక రంగాల్లో జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కు హబ్‌గా మారిందని, అలాగే AI-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, HCL టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే…. పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందన్నారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కొత్తగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని 2025లో దావోస్‌లో తెలంగాణ రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉందన్నారు.

Also Read: ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు


హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్స్..

తెలంగాణ రాష్ట్రం పోలీసింగ్, శాంతి భద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలో నంబర్ వన్‌గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 66 లక్షల మంది మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్స్, స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో AI నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందన్నారు.


హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు..

ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరుపొందిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయని, ఇంకా మరిన్ని ప్రపంచ ఈవెంట్‌లను తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందన్నారు. ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నామన్నారు.హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసడర్లుగా మారాలని పిలుపిస్తూ.. మన విజయాలను ప్రపంచానికి చూపలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి..

లక్షా 75వేల ఎకరాలు తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్...

నా నిర్ణయంలో మార్పు ఉండదు: కోహ్లీ

For More AP News and Telugu News

Updated Date - May 12 , 2025 | 02:12 PM