Telangana High Court: రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Nov 27 , 2025 | 06:33 PM
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లేకుంటే నాన్ బెయిలబుల్ ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది.
హైదరాబాద్, నవంబర్ 27: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీ లోపు కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఏవీ రంగనాథ్‌ను ఆదేశించింది. లేకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని ఆయన్ని హైకోర్టు హెచ్చరించింది. బతుకమ్మకుంట వ్యవహారంలో హైకోర్టుకు ఏవీ రంగనాథ్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంటలోని ప్రైవేట్ స్థలంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రైవేట్ స్థలంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దంటూ ఈ ఏడాది జూన్12వ తేదీన కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించారంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రైవేట్ స్థలంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆయనకు సూచించింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ రంగనాథ్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. కానీ కోర్టుకు హైడ్రా కమిషనర్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పేలిన వాషింగ్ మిషన్.. ఉలిక్కిపడ్డ ప్రజలు
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం
Read Latest TG News And Telugu News