Share News

Explosion in Washing Machine: పేలిన వాషింగ్ మిషన్.. ఉలిక్కిపడ్డ ప్రజలు

ABN , Publish Date - Nov 27 , 2025 | 05:49 PM

హైదరాబాద్ లోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలడం కలకలం రేపింది. ఈ పేలుడు ధాటికి జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడులో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

Explosion in Washing Machine: పేలిన వాషింగ్ మిషన్.. ఉలిక్కిపడ్డ ప్రజలు
washing machine

హైదరాబాద్, నవంబర్ 27: అమీర్‌పేట్‌లోని ఓ ఇంటి బాల్కానీలో గురువారం వాషింగ్ మిషన్ పేలింది. భారీ శబ్దంతో పేలడంతో.. వాషింగ్ మిషన్ తునాతునకలైపోయింది. ఈ పేలుడు సమయంలో బాల్కానీలో ఎవరూ లేకపోవడంతో.. భారీ ప్రాణ నష్టం తప్పినట్లు అయింది. వాషింగ్ మిషన్ రన్నింగ్‌లో ఉండగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి తామంతా భయబ్రాంతులకు ఆ ఇంటి యజమాని వెల్లడించారు. తమ కుటుంబంలోని ఎవరైనా బాల్కానీలో ఉండి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదన్నారు. ఈ పేలుడు ధాటికి వాషింగ్ మిషన్‌ లోపలి భాగాలు ఎగిరిపడ్డాయని వివరించారు.


సీలింగ్ తగిలి వాషింగ్ మిషన్ భాగాలు కింద పడ్డాయని తెలిపారు. అయితే వాషింగ్ మిషన్ పేలుడుకి గల కారణాలు తెలియాల్సి ఉంది. మిషన్ తయారీలో లోపమా? లేకుంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల పేలిందా? అన్నది కనుగొనాల్సి ఉంది. ఈ ఘటనపై వాషింగ్ మిషన్‌ సంస్థకు ఫిర్యాదు చేశామని ఇంటి యజమాని చెప్పారు. ఇక ఈ భారీ పేలుడుతో ఆ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లల్లోని ప్రజలు భయంతో బయటకు పరుగు తీశారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐపీఎస్ అధికారి సస్పెన్షన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

మళ్లీ తుఫాన్.. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

Read Latest TG News And Telugu News

Updated Date - Nov 27 , 2025 | 06:37 PM