IPS Sanjay: ఐపీఎస్ అధికారి సస్పెన్షన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:21 PM
ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ పని చేసిన సమయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందజేసింది. దాంతో ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం సంజయ్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
అమరావతి, నవంబర్ 27: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం జారీ చేసింది. దీంతో వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు సంజయ్‌పై సస్పెన్షన్ విధించినట్లు అయింది. సంజయ్ సస్పెన్షన్‌కు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులు నవంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఎన్ సంజయ్ పని చేశారు. ఆ సమయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందింది. దాంతో ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ కొద్ది రోజులకే సంజయ్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ కేసులో అరెస్టయిన సంజయ్.. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం
మళ్లీ తుఫాన్.. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
Read Latest AP News And Telugu News