Cold Wave Grips: చలిపులి.. రాత్రి 10 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రత
ABN , Publish Date - Nov 13 , 2025 | 10:28 PM
చలికాలం తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టింది. రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు వస్తున్నాయి. ఈ రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కు పడిపోనున్నాయని..
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శీతాకాలాన చలి పులి పంజా విసురుతోంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. నేడు (నవంబర్ 13) రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన అదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీమ్‌లో ఈ రాత్రి 8-9 డిగ్రీల వరకు చలి నమోదయ్యే అవకాశం ఉంది. గత 24 గంటల్లో అదిలాబాద్‌లో 11.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 14.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఉత్తర భారతదేశం నుంచి వీచే చల్లని గాలులు, ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో చలి మరింత తీవ్రమవుతోంది. రాబోయే మూడు రోజులు ఈ పరిస్థితి కొనసాగనుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలి తట్టుకునే దుస్తులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలి వల్ల జ్వరాలు, దగ్గు సమస్యలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..
Terror Accused Shaheen: అలా చేసిందంటే నమ్మశక్యంగా లేదు: షాహీన్ కుటుంబం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి