Share News

DNA Match Confirms: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..

ABN , Publish Date - Nov 13 , 2025 | 10:30 AM

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో దర్యాప్తు బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. సోమవారం ఎర్ర కోట దగ్గర బాంబు దాడికి పాల్పడింది ఉమరేనని దర్యాప్తులో తేలింది. ఐ20 కారు దగ్గర సేకరించిన డీఎన్‌ఏతో నిందితుడు ఉమర్ నబి బంధువుల నుంచి సేకరించిన డీఎన్ఏ సాంపిల్స్‌తో మ్యాచ్ అయ్యాయి.

DNA Match Confirms: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..
DNA Match Confirms

దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐ20 కారు దగ్గర సేకరించిన డీఎన్‌ఏతో నిందితుడు ఉమర్ నబి తల్లి నుంచి సేకరించిన డీఎన్ఏ సాంపిల్స్‌ మ్యాచ్ అయ్యాయి. దీంతో సోమవారం ఎర్ర కోట దగ్గర బాంబ్ దాడికి పాల్పడింది ఉమరేనని అధికారులు ధ్రువీకరణకు వచ్చినట్లు తెలుస్తోంది. బాంబు దాడిలో ధ్వంసం అయిన కారు ఆక్సిలరేటర్, స్టీరింగ్ మధ్యలో తెగిపడిన ఓ కాలును అధికారులు గుర్తించారు. దాని నుంచి డీఎన్ఏ శాంపిల్స్‌ను సేకరించారు. ఆ శాంపిల్స్‌ను ఉమర్ తల్లి డీఎన్ఏ శాంపిల్స్‌తో మ్యాచ్ చేశారు.


ఈ రెండూ మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అధికారులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి అధికారిక నివేదిక రావాల్సి ఉంది. దీనిపై ఫరీదాబాద్ పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘కారు నుంచి పలు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నాము. స్టీరింగ్, ఆక్సిలరేటర్ మధ్యలో ఇరుక్కున్న కాలు భాగం నుంచి డీఎన్ఏ శాంపిల్స్ తీసుకున్నాం. ఉమర్ తల్లిని కాశ్మీర్‌లో అదుపులోకి తీసుకున్నాం. అక్కడ ఆమెనుంచి డీఎన్‌ఏ శాంపిల్స్ తీసుకున్నాము. వాటిని టెస్ట్ కోసం ఢిల్లీకి తీసుకువచ్చాం. కాలు నుంచి సేకరించిన డీఎన్ఏ ఉమర్ తల్లి డీఎన్ఏతో మ్యాచ్ అయింది’ అని తెలిపారు.


కాగా, ఏ పదార్థాలను ఉపయోగించి దాడికి పాల్పడరనే దానిపై క్లారిటీ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్, ఆర్డీఎక్స్‌లను ఉపయోగించి ఈ దాడికి పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఉగ్రవాదులు మరో దాడికి కూడా ప్లాన్ చేశారు. డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత రోజున బాంబు దాడి చేయాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఆరుగుని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వీరిలో ఫరీదాబాద్‌కు చెందిన కారు డీలర్ కూడా ఉన్నాడు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఐ20 వైట్ కారును అమ్మింది అతడే. బాంబు దాడి జరగడానికి 13 రోజుల ముందే అతడు నిందితుడికి కారు అమ్మాడు.


ఇవి కూడా చదవండి

ఒడిశా టు ముంబై.. వయా సికింద్రాబాద్‌.. విషయం ఏంటంటే..

వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబుపై కేసు

Updated Date - Nov 13 , 2025 | 11:53 AM