TG Cabinet Key Decision: స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కార్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 17 , 2025 | 08:58 PM
హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలుగా ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 17: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయబావుట ఎగురవేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అలాంటి వేళ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9వ తేదీ తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని.. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు.
ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు ఆదేశాలు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించారు. అలాగే 50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మరో వారం, పది రోజుల్లో ఈ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లనున్నారు.
సోమవారం నాడు హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలపైనే ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..
Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం