Telangana Assembly Winter Sessions: తెలంగాణ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
ABN , First Publish Date - Dec 29 , 2025 | 10:14 AM
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ(సోమవారం) ఉదయం 10:30 గంటలకు సభ ప్రారంభం అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అన్నీ పార్టీల మ్మెల్యేలు సభకు హాజరయ్యారు.
Live News & Update
-
Dec 29, 2025 11:16 IST
అసెంబ్లీని రాజకీయాలకు అడ్డాగా మార్చుకోవద్దు: ఆది శ్రీనివాస్
హాజరు కోసం కాకుండా.. సభ జరిగినన్ని రోజులు కేసీఆర్ రావాలి: ఆది శ్రీనివాస్
మామా, అల్లుళ్ల గొడవకు అసెంబ్లీని వేదికగా మార్చుకోవద్దు: ఆది శ్రీనివాస్
-
Dec 29, 2025 11:16 IST
కొనసాగుతోన్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి అసెంబ్లీ సంతాపం
పలు ఆర్డినెన్స్‌లు, డాక్యుమెంట్లను సభలో ప్రవేశపెట్టిన..
మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల
-
Dec 29, 2025 10:56 IST
అసెంబ్లీకి కేసీఆర్ మొక్కుబడిగా కాకుండా.. రోజూ రావాలి: బీర్ల ఐలయ్య
పాలమూరును పక్కన పెట్టిందే కేసీఆర్: విప్ బీర్ల ఐలయ్య
ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం: బీర్ల ఐలయ్య
సంతలో పశువుల్లా కేసీఆర్ MLAలను కొనుగోలు చేశారు: బీర్ల ఐలయ్య
-
Dec 29, 2025 10:50 IST
కేసీఆర్ ను కలిసిన సీఎం రేవంత్..
అసెంబ్లీ దగ్గర కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ను కలిసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
అసెంబ్లీ అటెండెన్స్ రిజిశ్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయిన కేసీఆర్
-
Dec 29, 2025 10:37 IST
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
సభకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్
దివంగత సభ్యులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి,..
కొండ లక్ష్మణ్‌రెడ్డికి సంతాపం తెలిపిన అసెంబ్లీ
-
Dec 29, 2025 10:18 IST
తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్
MLAలతో కలిసి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్
-
Dec 29, 2025 10:18 IST
కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండ లక్ష్మణ్‌రెడ్డికి సంతాపం తెలపనున్న అసెంబ్లీ
పలు ఆర్డినెన్స్‌లను సభలో ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం
కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధమైన అధికార, విపక్షాలు
అసెంబ్లీ వాయిదా తర్వాత BAC సమావేశం
అసెంబ్లీ పనిదినాలు, ఎజెండా ఖరారు చేయనున్న BAC
-
Dec 29, 2025 10:16 IST
తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరింపు
అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ముట్టడిలు ఉండే అవకాశం
పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ముట్టడికి మాజీ సర్పంచ్‌లు పిలుపు
ముందస్తుగా మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు
-
Dec 29, 2025 10:14 IST
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ఉ.10:30కి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు
GST సవరణ ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్‌రెడ్డి
అసెంబ్లీకి హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్
సభ వాయిదా అనంతరం BAC సమావేశం
అసెంబ్లీ పనిదినాలు, బిజినెస్‌ను ఖరారు చేయనున్న BAC