Share News

Aga Khan: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్ మృతి పట్ల రేవంత్ సంతాపం

ABN , Publish Date - Feb 05 , 2025 | 11:43 AM

Aga khan: ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. బ్రిటన్‌ పౌరసత్వం కలిగిన ఆగాఖాన్ స్విట్జర్‌ల్యాండ్‌లో జన్మించారు. 20 ఏళ్ల వయస్సుల్లోనే అంటే 1957లో ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇమామ్‌గా ఆగాఖాన్ నియమితులయ్యారు.

Aga Khan: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్ మృతి పట్ల రేవంత్ సంతాపం
Aga Khan passes away

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు, పద్మ విభూషణ్‌ గ్రహీత ఆగాఖాన్‌‌‌ (88) (Aga Khan) కన్నుమూశారు. ఆగాఖాన్ మృతి చెందిన విషయాన్ని ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రకటించింది. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. బ్రిటన్‌ పౌరసత్వం కలిగిన ఆగాఖాన్ స్విట్జర్‌ల్యాండ్‌లో జన్మించారు. 20 ఏళ్ల వయస్సుల్లోనే 1957లో ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇమామ్‌గా ఆగాఖాన్ నియమితులయ్యారు. వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతో పాటు అనేక ఇతర వ్యాపారాల్లో రాణించిన ఆయన.. యూకే‌, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌ వంటి దేశాల్లో నిర్వహించే గుర్రాల రేసుల్లోనూ పాల్గొన్నారు. షేర్గర్‌ జాతికి చెందిన గుర్రంతో ఆయన రేసుల్లో పాల్గొనేవారు.

పాపం.. ఆ అమ్మాయి ఏం చేసింది?


1967లో ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ను స్థాపించారు. ఇది ప్రంచంలోనే వందలాది ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేసింది. ఆగాఖాన్ నెట్ వర్క్ ద్వారా వివిధ దేశాల్లో ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి మానవాళికి సేవలందించారు. ఆయన సేవలకు గాను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అత్యున్నత పౌరపురస్కారాన్ని అందుకున్నారు. ఆగాఖాన్ మృతిపట్ల కింగ్ చార్లెస్ 3ను తీవ్ర మనస్థాపానికి గురిచేసినట్లు తెలుస్తోంది. ఆగాఖాన్‌తో ఆయనకు కింగ్ చార్లెస్ 3, ఆయన తల్లి దివంగత క్వీన్‌ ఎలిజబెత్‌ 2కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.


రేవంత్ సంతాపం..

revanth-hyderabad.jpg

ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఇస్మాయిలీ ముస్లింల వారసుడిగా ఆధ్యాత్మిక గురువుగా నియమితులైన కరీం అల్-హుస్సేనీ ఆగాఖాన్ IV మరణం మానవాళికి తీరని లోటని అన్నారు. గొప్ప సామాజిక వేత్త, మానవతావాదిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును అందుకున్నారని తెలిపారు. ఆగాఖాన్ నెట్ వర్క్ ద్వారా వివిధ దేశాల్లో ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి మానవాళికి తన సేవలను అందించారని గుర్తు చేశారు. పేదరిక నిర్ములన, వారసత్వ సంపద పరిరక్షణకు, వైద్య సేవలు, విద్యా రంగంలో ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని, హైదరాబాద్ కేంద్రంగా ఆగా ఖాన్ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో గొప్పవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆయన జీవితాంతం మానవ జాతి గౌరవం పెంచే ఉన్నత విలువలను ఆచరించారని కొనియాడారు. వారి వారసులకు, కుటుంబసభ్యులకు, అనుచరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఇవి కూడా చదవండి...

BRS: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. ఆ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

మరింత పెరిగిన బంగారం ధరలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 05 , 2025 | 11:57 AM