Share News

Funny Viral Video: పాపం.. ఆ అమ్మాయి ఏం చేసింది? ట్రైన్‌ ఆగినపుడు ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Feb 05 , 2025 | 11:30 AM

ముంబై, ఢిల్లీ మెట్రో రైళ్లలో కొందరు చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటున్నాయి. కేవలం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసమే చాలా మంది వీడియోలు రూపొందించి వాటిని ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.

Funny Viral Video: పాపం.. ఆ అమ్మాయి ఏం చేసింది? ట్రైన్‌ ఆగినపుడు ఏం చేశాడో చూడండి..
Funny viral Video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మెట్రో రైళ్లకు (Metro Trains) సంబంధించిన పలు వీడియోలకు కూడా ఆదరణ లభిస్తోంది. ముంబై, ఢిల్లీ మెట్రో రైళ్లలో కొందరు చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటున్నాయి. కేవలం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసమే చాలా మంది వీడియోలు రూపొందించి వాటిని ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు (Viral Video).


delhi.connection అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. మెట్రో రైలు గేటు దగ్గర ఒక అమ్మాయి, అబ్బాయి నిలబడి ఉన్నారు. ముందు అమ్మాయి, వెనుక ఒక అబ్బాయి నిలబడి ఉన్నారు. మెట్రో రైలు ఏదో స్టేషన్ ప్లాట్‌ఫారమ్ దగ్గర ఆగి ఉంది. దాని తలుపులు తెరిచి ఉన్నాయి. మెట్రో తలుపులు మూసుకోబోతున్న సమయంలో, వెనుక ఉన్న ఆ అబ్బాయి ఆ అమ్మాయిని బయటకు తోసేశాడు. ఆ అమ్మాయి బయటకు వెళ్లిన సమయంలో మెట్రో రైలు తలుపులు మూసుకుపోయాయి. దీంతో ఆ అమ్మాయి తిరిగి రైలు ఎక్కడం వీలు కాలేదు.


ఫ్లాట్‌ఫామ్ మీద నిస్సహాయంగా ఉండిపోయిన ఆమెకు ఆ అబ్బాయి చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పాడు. ఫన్నీగా చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ అమ్మాయి ఎక్కువగా మాట్లాడుతోందా``, ``వెరీ ఫన్నీ``, ``ఆ అమ్మాయి షాక్ అయింది``, ``ఇది ఎంత మాత్రం ఫన్నీ కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Couple Viral Video: అయ్యో.. నడిరోడ్డు మీద ఏంటీ పని? జంట చేష్టలు చూసి అవాక్కవుతున్న జనం..


Optical Illusion: మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్ అయితేనే.. ఈ ఫొటోలో రెండో మనిషిని 10 సెకెన్లలో కనిపెట్టగలరు..


Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..


Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 11:55 AM