Smita Sabharwal: స్మితా సబర్వాల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ..
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:31 AM
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదకను వెంటనే రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 25: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల వ్యవహారంలో తన ప్రమేయం ఉందంటూ స్పష్టం చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను వెంటనే కొట్టివేయాలంటూ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. తన వివరణ కోరలేదని ఆ పిటిషన్‌లో స్పష్టం చేశారు. అలాగే 8బీ, 8సీ నోటీసులు సైతం తనకు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశాన్ని ఈ రోజు.. తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వేళ.. స్మితా సబర్వాల్ చేపట్టిన చర్యలను జసిస్ట్ పీసీ ఘోష్ కమిషన్.. తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది. అధికారిగా ఆమె కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై స్మితా సబర్వాల్ సమీక్ష చేసిందని కమిషన్ తన నివేదికలో వెల్లడించంది. అలాగే కొన్ని జిల్లాల్లో ఆమె పర్యటించి.. అందుకు సంబంధించిన ఫీడ్ బ్యాక్‌ను ఎప్పటికప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్మితా సబర్వాల్ చేరవేశారని జస్టిస్ పీసీ ఘోష్ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
అదే విధంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్బాల్లో ఈ మూడు బ్యారేజీలను స్మిత సబర్వాల్ సందర్శించారని తన నివేదికలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది. నిజా నిజాలు కేబినెట్ ముందు పెట్టినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ఈ రోజు విచారణ జరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
పార్టీ పరిశీలకులతో అగ్రనేతలు భేటీ
Read Latest Telangana News And Telugu News