Share News

Sheep Scam Case: గొర్రెల స్కామ్‌లో ఈడీ నోటీసులు.. విచారణకు రాకుంటే..

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:04 PM

గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు తయారీ చేశారని.. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఏసీబీ చెబుతోంది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఇప్పటికే అరెస్టు కాగా.. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీపైనా కేసు నమోదు అయ్యింది.

Sheep Scam Case: గొర్రెల స్కామ్‌లో ఈడీ నోటీసులు.. విచారణకు రాకుంటే..
ED Issues Notices

హైదరాబాద్‌: గొర్రెల స్కామ్ కేసు(Sheep Scam Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దూకుడు పెంచింది. ఈ కేసు విచారణకు రావాలంటూ తాజాగా బాధితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 15న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. కాగా, గొర్రెల స్కామ్ కేసులో ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీ విచారణ ఆధారంగానే ఈడీ సైతం దర్యాప్తు జరుపుతోంది.


ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ఎగవేసిన బ్రోకర్లు ప్రభుత్వ పథకం నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారితో అధికారులు సైతం చేతులు కలిపి కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఏసీబీ (Telangana Sheep Distribution Scam) ఆరోపిస్తోంది. గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు తయారీ చేశారని.. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఏసీబీ చెబుతోంది.


ఈ కేసులో పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఇప్పటికే అరెస్టు కాగా.. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీపైనా(ACB Probe) కేసు నమోదు అయ్యింది. కాగా, తాజాగా బాధితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో ఈ కేసు వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Updated Date - Sep 11 , 2025 | 06:06 PM