Share News

Gold Smuggling: ఓరయ్యా.. స్మగ్లింగ్ ఇలా కూడా చేస్తారా..

ABN , Publish Date - May 01 , 2025 | 03:30 PM

Gold Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద బంగారాన్ని గుర్తించారు డీఆర్‌ఐ అధికారులు.

Gold Smuggling: ఓరయ్యా.. స్మగ్లింగ్ ఇలా కూడా చేస్తారా..
Gold Smuggling

హైదరాబాద్, మే 1: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఎయిర్‌పోర్టులో దాదాపు 3.5కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 3.5 కిలోల బంగారం డీఆర్ఐ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 30 బంగారం బిస్కెట్‌లను మూడు జేబుల్లో అమర్చుకొని వస్తుండగా అధికారులు గుర్తించారు. బంగారం అక్రమ రవణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


మస్కట్ నుంచి వచ్చిన విమానంలో అనుమానస్పదంగా ఉన్న వ్యక్తిని డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. దాదాపు మూడు కిలలోకు పైగా బంగారం లభించింది. అలాగే ఈ బంగారానికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేవని గుర్తించారు. దుబాయ్‌లో బంగారం ధర తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడకు స్మగ్లింగ్ చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు


కాగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తరచూ బంగారం పట్టుబడటం చూస్తుంటాం. కొందరు వ్యక్తులు వివిధ రూపాల్లో బంగారాన్ని తరలించేందుకు యత్నిస్తుంటారు. ముఖ్యంగా దుబాయ్‌ నుంచి బంగారాన్ని ఇక్కడకు అక్రమంగా తీసుకువచ్చి క్యాష్ చేసుకోవాలని భావిస్తుంటారు. ఇందులో కొత్త కొత్త రీతుల్లో బంగారాన్ని తరలించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి వాళ్ల ఆటకట్టిస్తుంది డీఆర్‌ఐ. విదేశాల నుంచి వచ్చే వారిలో అనుమానాస్పదంగా ఉన్న వారిని గుర్తించి వారి తనిఖీ చేసి మరీ వారి వద్ద ఉన్న బంగారాన్ని సీజ్ చేస్తుంటారు. ముఖ్యంగా దుబాయ్ నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంటారు. కొన్ని సార్లు బంగారం అక్రమ రవాణా గురించి ముందస్తుగా సమాచారం అందుకుని మరీ వారిని అడ్డుకుంటారు అధికారులు. ఈ మధ్య కాలంలో శంషాబాద్ విమానశ్రయంలో బంగారం స్మగ్లింగ్ కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. క్రితం ఏడాది ఎన్నోసార్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించినప్పటికీ వారిని కస్టమ్స్ అధికారులు పట్టుకుని బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

Amazon Placement: ఆ స్టూడెంట్ ప్యాకేజ్‌ చూస్తే కళ్లు చెదరాల్సిందే.. ప్రియాంక సక్సెస్ స్టోరీ

BC Janardhan: పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 01 , 2025 | 04:04 PM