Hyderabad Airport: ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్.. భద్రతా సిబ్బంది అలర్ట్
ABN , Publish Date - Oct 29 , 2025 | 09:21 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రతీ ప్రయాణికుడి బ్యాగ్‌లను భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుంటారు. అయితే ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్ 29: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) బుల్లెట్ కలకలం రేపుతోంది. కోల్‌కత్తా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద బుల్లట్‌ను భద్రతా సిబ్బంది గుర్తించింది. ప్రయాణికుడు విశాల్‌గా గుర్తించారు. అతని వద్ద ఉన్న బ్యాగులో 38 ఎంఎం బుల్లెట్ లభ్యమైంది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
శంషాబాద్ విమానాశ్రయం నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు, వీఐపీలు, ప్రముఖులు ఎయిర్‌పోర్టుకు వస్తుంటారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రతీ ప్రయాణికుడి బ్యాగ్‌లను భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుంటారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అప్పుడప్పుడూ అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం పట్టుబడుతుంటుంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విశాల్ అనే నిందితుడు కోల్‌కత్తా నుంచి హైదరాబాద్ వస్తూ తన బ్యాగ్‌లో బుల్లెట్‌ను తీసుకుని వచ్చాడు.
అయితే అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయగా... అసలు విషయం బయటపడింది. వెంటనే నిందితుడిని ఆర్జీఐఏ ఔట్ పోస్టు పోలీసులకు అప్పగించారు. బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బుల్లెట్‌ను ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు.. అతడికి బుల్లెట్‌ను ఎవరు ఇచ్చారు.. బుల్లెట్ తీసుకురావడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ లభ్యంకావడంతో ప్రయాణికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి...
రిజర్వేషన్ల సాధనకు త్వరలో బీసీ రథయాత్ర..
అండగా ఉంటాం.. అభివృద్ధి చేస్తాం..
Read Latest Telangana News And Telugu News