Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లీ బాంబు బెదిరింపులు.. ఆ ఫ్లైట్‌పై లేజర్ లైట్.!
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:57 AM
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో ఈ ఎయిర్‌పోర్ట్‌కు 2025లో ఇప్పటివరకు 30 సార్లకుపైగా బాంబు బెదిరింపులు వచ్చాయి.
హైదరాబాద్, డిసెంబర్ 28: శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి(Bomb Threats at Shamshabad Airport). కొచ్చి, జెడ్డా నుంచి వస్తున్న ఇండిగో విమానాల్లో ఆర్డీఎక్స్ బాంబు అమర్చినట్టు గుర్తుతెలియని అగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం అంతా ముమ్మర తనిఖీలు చేపట్టారు. మరోవైపు కోల్‌కతా- శంషాబాద్ ఇండిగో ఫ్లైట్‌పై లేజర్ లైట్ పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఇండిగో విమానాన్ని లేజర్ లైట్లు తాకాయని అక్కడి అధికారులు వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇటీవల వరుస బాంబు బెదిరింపు మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సిబ్బంది అప్రమత్తమై.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ తరహా బెదిరింపు కాల్స్, మెయిల్స్‌పై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో శంషాబాద్(Shamshabad) ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటివరకు 30కి పైగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
Also Read:
కల్వర్టులోకి దూసుకెళ్లిన బైక్.. యువకులు దుర్మరణం..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీరు ఎక్కవలసిన రైలు మిస్సయ్యిందా..?