Share News

Padma Rao Goud: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు

ABN , Publish Date - Jan 21 , 2025 | 08:09 PM

Padma Rao Goud: డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు స్వల్ప గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను డెహ్రాడూన్‌లో ఉండే ఓ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందజేశారు.

Padma Rao Goud: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
MLA Padma Rao Goud

హైదరాబాద్: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు స్వల్ప గుండెపోటు వచ్చింది. గుండెపోటు రావడంతో డెహ్రాడూన్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే డెహ్రాడూన్ పర్యటనలో పద్మారావు గౌడ్ ఉన్నారు. ఈరోజు రాత్రి హైదరాబాద్‌కు పద్మారావు రానున్నారు. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు పద్మారావు గౌడ్ వెళ్లారు. పద్మారావు గౌడ్‌కు గుండెపోటు వచ్చిందని తెలియడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందారు.


పద్మారావు గౌడ్ ఆరోగ్యం నికలడగా ఉందని, పూర్తిగా కోలుకున్నారని వైద్యులు తెలియజేయడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు, పద్మారావు గౌడ్ ఇవాళ రాత్రికి సికింద్రాబాద్‌కు తిరిగి వస్తారని తెలియడంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు పద్మారావు ఇంటికి చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా పద్మారావు గౌడ్ ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలిసింది.

Updated Date - Jan 21 , 2025 | 10:27 PM