Share News

Chikitha Taniparthi: మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికితను అభినందించిన సీఎం రేవంత్

ABN , Publish Date - Sep 08 , 2025 | 04:44 PM

మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తి ( CHIKITHA TANIPARTHI)ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చికిత తనిపర్తి మర్యాదపూర్వకంగా కలిశారు.

Chikitha Taniparthi: మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికితను అభినందించిన సీఎం రేవంత్
Archery Champion Chikitha Taniparthi

హైదరాబాద్, సెప్టెంబర్ 08: మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తి ( CHIKITHA TANIPARTHI)ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చికిత తనిపర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళగా చికిత తనిపర్తి రికార్డు సృష్టించారు.


ఈ నేపథ్యంలో సీఎంను ఆమె కలిశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు ప్రభుత్వం తరపున పూర్తి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చికితకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇటీవల చైనాలోని షాంఘైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ జట్టు రజత పతకాన్ని ఆమె సాధించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, రాజేందర్ రావు తదితరులు చికిత వెంట ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్

ఐఏఎస్‌లు బదిలీ.. టీటీడీ ఈఓగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్

For More TG News And Telugu News

Updated Date - Sep 08 , 2025 | 06:50 PM