kokapet Lands: కోకాపేటలో ఎకరం రూ. 151 కోట్లు.. రికార్డు స్థాయిలో పలికిన ధరలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 07:12 PM
కోకాపేటలోని భూములకు ఈ వేలం ఈ రోజు కొనసాగింది. శుక్రవారం ఈ భూములకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151. 25 కోట్ల ధర పలికింది.
హైదరాబాద్, నవంబర్ 28: హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కోకాపేటలోని నియోపోలీస్ భూములకు రెండో విడత ఈ వేలం నిర్వహించింది. శుక్రవారం ఈ భూములకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151. 25 కోట్ల ధర పలికింది. ఇక ప్లాట్ నెంబర్ 16లో ఎకరానికి రూ.147.75 కోట్లు ధర వచ్చింది. రెండో విడతలో వేలం 9.06 ఎకరాలకు 1,352 కోట్లను హెచ్‌ఎండీఏ పొందింది. ప్లాట్ నెంబర్ 15లో 4.03 ఎకరాలకుగాను రూ. 609.55 కోట్లు.. ప్లాట్ నెంబర్16లో 5.03 ఎకరాలకు రూ. 743 కోట్లు హెచ్‌ఎండీఏకి వచ్చాయి. రెండో విడత ఈ వేలం ఈ రోజుతో ముగిసింది.
ఇటీవల హెచ్‌ఎండీఏ అధికారులు కోకాపేటలోని నియోపోలీస్ లే అవుట్‌లో రెండు ప్లాట్లకు హెచ్‌ఎండీఏ అధికారులు వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డు ధర లభించింది. ఒక ప్లాట్‌లో ఎకరం రూ. 137.25 కోట్లు పలికింది. మరో ప్లాట్ ఎకరానికి రూ.136.50 కోట్లు పలికింది. దీంతో అధికారులు ఊహించినట్టుగానే ఈ సారి భూముల వేలంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరినట్లు అయింది. హెచ్‌ఎండీ అధికారులు.. హైదరాబాద్‌లోని కోకాపేట, మూసాపేట తదితర ప్రాంతాల్లోని 42 ఎకరాల భూములను ఈ వేలంలో విక్రయానికి పెట్టారు.
సోమవారం కోకాపేటలోని నియోపోలీస్ లే అవుట్‌లో ప్లా్ట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు, ప్లా్ట్ నెంబర్ 18 లో 5.31 ఎకరాలు భూములకు వేలం జరిగింది. ప్లాట్ నెంబర్ 17లో ఎకరానికి రూ. 136.50 కోట్లు, 18లో ఎకరానికి 137.25 కోట్లు వచ్చాయి. ఇక 2023లో జరిగిన వేలంలో ఎకరానికి సగం ధర అంటే.. రూ.73 కోట్లు పలికింది. ఈ సారి 87 శాతం పెరిగిందని హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. రెండు నెలల క్రితం తుర్కయాంజల్, బాచుపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లోని భూములను వేలం వేశారు. వీటికి పెద్దగా స్పందన రాకపోవడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధం
అమరావతి కోసం రుణం.. ఆమోదించిన ప్రభుత్వం
For More TG News And Telugu News