Capital Amaravati: అమరావతి కోసం రుణం.. ఆమోదించిన ప్రభుత్వం
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:37 PM
రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అమరావతి కోసం రూ.7,500 కోట్ల రుణం తీసుకునేందుకు గురువారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అమరావతి, నవంబర్ 28: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అమరావతి కోసం రూ.7,500 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్ఏబీఎఫ్‌ఐడీ నుంచి ఈ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదించింది. తీసుకోనున్న రూ.7,500 కోట్ల రుణానికి హామీ ఇస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది.
రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ కమిషనర్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిధులను రాజధాని అమరావతి అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను గురువారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేశ్ కుమార్ జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌కి కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్న బీసీలు: ఎంపీ ఈటల
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్
For More AP News And Telugu News