Land Pooling In Amaravati: మళ్లీ ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధం
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:09 PM
రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. ఈ దశలో మరో16 వేల ఎకరాల సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి, నవంబర్ 28: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. ఈ దశలో మరో16 వేల ఎకరాల సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. మొదటి దశలో ప్రభుత్వ భూమి16 వేల ఎకరాలు సీఆర్డీఏకు ప్రభుత్వం అప్పగించింది. రాజధాని అమరావతి కోసం మొత్తం 50 వేల ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. మొదటి దశలో రైతుల నుంచి 34 వేల ఎకరాల సమీకరణ.. రెండో దశలో మరో 16 వేల ఎకరాలపై కసరత్తు చేస్తోంది. త్వరలో ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను సీఆర్డీఏ విడుదల చేయనుంది.
మొత్తం ప్రభుత్వ భూమి, రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమితో కలిపి 74 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఇక ఈ రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూ సేకరణ చేయనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అసైన్డ్ భూములతో కలిపి మొత్తం 20, 494 ఎకరాల భూ సేకరణ ద్వారా సీఆర్డీఏ తీసుకోనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి కోసం రుణం.. ఆమోదించిన ప్రభుత్వం
కాంగ్రెస్‌కి కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్న బీసీలు: ఎంపీ ఈటల
For More AP News And Telugu News