Akhanda 2 Ticket Prices Issue: బాలకృష్ణకు మరో షాక్.. అఖండ-2పై హైకోర్టులో పిటిషన్
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:41 PM
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాకు మరో సమస్య ఎదురైంది. సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో అఖండ 2 సినిమా టికెట్ల ధర పెంపుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ వేశారు. లంచ్ మోషన్‌కి అనుమతించిన న్యాయస్థానం.. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై విచారణ చేయనుంది.
కాగా, అఖండ-2 తాండవం సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు రేవంత్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి సంగతి తెలిసిందే. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి కల్పించింది. డిసెంబర్ 11వ తేదీ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించగా అందుకు కూడా ఓకే చెప్పింది. అయితే, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూనే చిత్ర బృందానికి రేవంత్ ప్రభుత్వం ఓ షరతు పెట్టింది. సినిమా టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read:
ఐ షో స్పీడ్‌కు షాక్.. భారీ మూల్యం తప్పదా?..
మంత్రులు ఇలా చేస్తే సహించేది లేదు.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
For MOre Latest News