Share News

YouTuber iShowSpeed: ఐ షో స్పీడ్‌కు షాక్.. భారీ మూల్యం తప్పదా?..

ABN , Publish Date - Dec 11 , 2025 | 01:45 PM

ఐ షో స్పీడ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆ వివాదం కారణంగా అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వివాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

YouTuber iShowSpeed: ఐ షో స్పీడ్‌కు షాక్.. భారీ మూల్యం తప్పదా?..
YouTuber iShowSpeed

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండేవారికి ఐ షో స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అతడికి మంచి గుర్తింపు ఉంది. ఐ షో స్పీడ్ తన వింత వింత చేష్టలతో.. సాహసపూరితమైన స్టంట్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో అతడికి కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నేమ్, ఫేమ్ ఉన్న ఐ షో స్పీడ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆ వివాదం కారణంగా అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ సంగతేంటంటే.. ఐ షో స్పీడ్ లైవ్ స్ట్రీమ్స్ నిర్వహిస్తూ ఉంటాడు. రిజ్‌బాట్ అనే రోబోట్‌కు ఐ షో స్పీడ్ లైవ్ స్ట్రీమ్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది.


గత సెప్టెంబర్ 16వ తేదీన లైవ్ స్ట్రీమింగ్ జరిగింది. రిజ్‌బాట్ ఈ లైవ్ స్ట్రీమింగ్‌లో పాల్గొంది. టోపీ పెట్టుకుని అటు, ఇటు తిరగసాగింది. ఏమైందో ఏమో తెలీదు కానీ, రిజ్‌బాట్ ప్రవర్తనతో ఐ షో స్పీడ్‌కు కోపం వచ్చింది. కొంత సేపు దాన్ని బాగా తిట్టాడు. తర్వాత కింద పడేసి దాడి చేశాడు. ఐ షో స్పీడ్ పక్కన ఉన్న మరో వ్యక్తి అతడ్ని అడ్డుకున్నాడు. పక్కకు తీసుకుని వెళ్లాడు. ఐ షో స్పీడ్ దాడిలో రిజ్‌బాట్ బాగా డ్యామేజీకి గురైంది. ఇక, ఈ సంఘటనపై రిజ్‌బాట్‌ను తయారు చేసిన కంపెనీ సీరియస్ అయింది. ఐ షో స్పీడ్‌పై చర్యలకు సిద్ధమైంది. రిజ్‌బాట్‌పై దాడి చేసి డ్యామేజ్ అయ్యేలా చేసినందుకు 1 మిలియన్ డాలర్లు ఇవ్వాలని కోరుతూ టెక్సాస్ కోర్టులో కేసు వేసింది.


కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘ఐ షో స్పీడ్ చేసిన పనికి రోబోట్ సరిగా పని చేయటం లేదు. బాగా డ్యామేజ్ అయింది. నోరు, గొంతు, మెకానికల్ సెన్సార్ రిలేటెడ్ కాంపోనెంట్స్ దెబ్బతిన్నాయి. ఇకపై ఆ రోబోట్ సరిగా నడవలేదు. దాని సోషల్ మీడియా ఖాతాలకు వీక్షణలు కూడా బాగా తగ్గిపోయాయి. ఎంగేజ్‌మెంట్ 70 శాతం తగ్గిపోయింది. హెడ్ కెమెరాలు పని చేయటం లేదు’ అని పేర్కొంది. గత నవంబర్ నెలలో కంపెనీ కేసు వేసింది. కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఐ షో స్పీడ్ భవిష్యత్తు కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది. కంపెనీకి అనుకూలంగా కోర్టు తీర్పును ఇస్తే అతడి జీవితం నాశనం అయినట్లే లెక్క. 1 మిలియన్ డాలర్లు కట్టడానికి ఇంత వరకు సంపాదించుకున్నదంతా ఇచ్చేయాల్సిందే.


ఇవి కూడా చదవండి

అఖండ 2 టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్

ఇద్దరు ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

Updated Date - Dec 11 , 2025 | 01:51 PM