Bathula Prabhakar: బత్తులను కస్టడీకి కోరిన పోలీసులు.. విచారణ వాయిదా
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:47 PM
Bathula Prabhakar: బత్తుల ప్రభాకర్‌ను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అతడు చేసిన నేరాలు, నేరచరిత్రను తెలుసుకోవాలనుకున్నారు. 2013 నుంచి నేరాలు చేయడం షురూ చేశాడు బత్తుల ప్రభాకర్. అప్పటి నుంచి వందల చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో బత్తుల ప్రభాకర్‌ను (Bathula Prabhakar) పోలీసులు కస్టడీకి కోరారు. ప్రిజం పబ్ కాల్పుల కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తుండటంతో ప్రభాకర్‌ను ఏడు రోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుగనుంది. అలాగే ప్రిజం పబ్ కేసులో నిన్న (గురువారం) సాఫ్ట్‌వేర్ రంజిత్ అరెస్ట్ అయ్యారు. ప్రభాకర్‌కు రంజిత్ బస్సులో పరిచయం అయ్యాడు. ప్రభాకర్‌కు రంజిత్ బ్యాంక్ అకౌంట్‌లు సమకూర్చి హెల్ప్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి బీహార్‌కు వెళ్లి గన్స్ కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రభాకర్ అరెస్ట్‌తో పారిపోయిన రంజిత్‌ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం బత్తుల ప్రభాకర్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. ప్రభాకర్‌ను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అతడు చేసిన నేరాలు, నేరచరిత్రను తెలుసుకోవాలనుకున్నారు. 2013 నుంచి నేరాలు చేయడం షురూ చేశాడు బత్తుల ప్రభాకర్. అప్పటి నుంచి వందల చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 80 నుంచి వంద వరకు బత్తుల ప్రభాకర్‌పై కేసులు ఉన్నాయి. ప్రధానంగా విద్యాలయాలనే టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. సుమారు 23 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు ప్రభాకర్. నేరాలు చేసిన సమయంలో పట్టుబడితే తప్పించుకునేందుకు వీలుగా తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ గన్స్‌ను బీహార్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
NITI Aayog team: సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ..
అయితే అతడు గన్స్ ఎప్పుడు కొనుగోలు చేశాడు.. గన్స్ కొనుగోలులో సహకరించిన వారు ఎవరు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అందుకు అనుగుణంగా బత్తులను కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. మరోవైపు కొల్లగొట్టిన సొమ్మునంతా ఎక్కడ దాచాడు.. ఎవరెవరకి ఇచ్చాడనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఇక అతడికి ఎవరైనా సహకరించారా అనే అంశాలపై కూడా విచారణ జరిపిన పోలీసులకు రంజిత్ పేరు బయటకు వచ్చింది. బత్తుల ప్రభాకర్‌కు రంజిత్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రంజిత్ సహకారంతో గన్స్ కొనుగోలు చేసిన నేపథ్యంలో వీరిద్దరికీ ఎవరు సహకరించారు అనే అంశాలపై విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి...
జగన్‌కు సాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News And Telugu News