Share News

NITI Aayog team: సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ..

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:21 PM

NITI Aayog team: నీతి ఆయోగ్ బృందం ఈరోజు (శుక్రవారం) రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ వారికి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం ప్రతినిధులు సమావేశం అయ్యారు.

NITI Aayog team: సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ..
NITI Aayog team meets CM Chandrababu

అమరావతి, ఫిబ్రవరి 7: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (CM Chandrababu Naidu) నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి ( Niti Aayog Vice Chairman Suman Bery) నేతృత్వంలోని బృందం సమావేశమైంది. భేటీ కోసం శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకుంది నీతి ఆయోగ్ బృందం. ఈ సందర్బంగా సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులతో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ అవనున్నారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వికసిత్ ఏపీ - 2047 విజన్ డాక్యుమెంట్‌పై చర్చించనున్నారు. ఏపీలో అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై భేటీలో చంద్రబాబు, పయ్యావుల చర్చించనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ పనగారియాను సీఎం చంద్రబాబు, పయ్యావుల కలిసిన విషయం తెలిసిందే.

Shekhar Basha: లావణ్యపై శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు


నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంలో కీలక బృందం ఈరోజు ఏపీకి వచ్చారు. ఏ.ముత్తు కుమార్ ఐఏఎస్, పార్థసారథి రెడ్డి ఐఏఎస్. కె. కిషోర్ భేటీలో పాల్గొన్నారు. అలాగే నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ ఈ భేటీకి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వికసిత్ ఏపీ- 2047 విజన్ డాక్యుమెంట్‌‌పై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీకి ఉన్న అప్పులు వాటితో పాటు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరుగనుంది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని వారికి వివరించనున్నారు. 16వ ఫైనాన్స్‌ కమిషన్‌ను కూడా కలిసిన నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించుకోవడంతో పాటు పన్నుల్లో వాటా, వివిధ కేంద్ర ప్రయోజిత పధకాల్లో రావాల్సిన వాటాలపైన రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై వీరి భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

హైడ్రా దూకుడు.. ఎయిర్ పోర్టు దగ్గర..

గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 07 , 2025 | 01:21 PM