Share News

Film Piracy: పైరసీపై నిఘా తప్పనిసరి: దామోదర ప్రసాద్

ABN , Publish Date - Sep 30 , 2025 | 02:26 PM

పైరసీ దారులు చాలా అడ్వాన్స్‌డ్‌గా హ్యాకింగ్ చేస్తున్నారని దామోదర ప్రసాద్ పేర్కొన్నారు. వారిని పట్టుకోవటానికి పోలీసులు తమ స్టిస్టమ్స్‌ను అప్డెట్స్ చేసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే ఇక ముందు కూడా పైరసీపై నిరంతరం నిఘూ ఉండాల్సిందే అని అన్నారు.

Film Piracy: పైరసీపై నిఘా తప్పనిసరి: దామోదర ప్రసాద్
Film Piracy

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఫిలిం ఛాంబర్‌కు యాంటీ పైరసీ సెల్ ఎప్పటి నుంచో ఉందని.. కానీ అవన్నీ ఫిజికల్ పైరసీని అడ్డుకోవటానికి మాత్రమే అని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. కానీ ఈ మధ్యకాలంలో హెడ్.‌డి ప్రింట్స్ వస్తున్నాయన్నారు. గేమ్ ఛేంజర్ , సింగిల్ , హిట్ 3 ఇలా వరుసగా సినిమాల క్వాలిటీ ప్రింట్స్ వచ్చాయని అన్నారు. జూన్‌లో తాము ఈ పైరసీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని, పోలీసులను అప్రోచ్ అయ్యామని చెప్పారు. సీపీ ఆనంద్ తమ కేసును ప్రత్యేకంగా తీసుకుని టీంస్‌ను ఏర్పాటు చేసి పైరసీ రాకెట్‌ను చేధించారని అన్నారు.


పైరసీ దారులు చాలా అడ్వాన్స్‌డ్‌గా హ్యాకింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. వారిని పట్టుకోవటానికి పోలీసులు తమ స్టిస్టమ్స్‌ను అప్డెట్స్ చేసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే ఇక ముందు కూడా పైరసీపై నిరంతరం నిఘూ ఉండాల్సిందే అని అన్నారు. సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లేబర్ కమీషనర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు జరిగిందని... రెండు నెలల సమయంలో అన్నీ ఓ కొలిక్కి వస్తాయని చెప్పారు. ట్రంప్ టారిఫ్ అనేది వారి దేశానికి సంబంధించిన పాలసీ అని.. దాని ఎఫెక్ట్ ఒక్క తెలుగే కాదు అన్నీ సినిమాలపై ఉంటుందని చెప్పారు. టారిఫ్‌కు అనుగుణంగా బిజినెస్ మోడల్ మార్చుకోవాలని ఫిలింఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

డీజీపీ జితేందర్ కంటతడి... ఎందుకంటే

ఆదిత్య వింటేజ్ నిర్మాణాలపై ఎంపీ రఘునందన్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2025 | 02:36 PM