Alliance Airlines: శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానంలో 67 మంది ప్రయాణికులు
ABN , Publish Date - Aug 19 , 2025 | 09:12 AM
ఓ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగింది. హైదరాబాద్ - తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో టేకాఫ్ తర్వాత పైలెట్ సాంకేతిక లోపం గుర్తించారు.
హైదరాబాద్: విమానా ప్రమాదాలు, విమానం సాంకేతిక లోపాలతో వెనుతిరగడం వంటి వార్తలు ఒకప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. రోజుకో విమాన ప్రమాద ఘటన చూస్తూ.. అది ఒక సాధారణ వార్తగా మారిపోయింది. ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఏదో ఒక విమానం ప్రమాదానికి గురవుతునే ఉంది. ఇన్ని ప్రమాదాలు, సాంకేతిక లోపాలు విమానాల్లో బయటపడుతున్న విమానాలకు సంబంధించిన కంపెనీలు మాత్రం ఏ మాత్రం చలించడం లేదు. ప్రజల ప్రాణాలు లెక్క లేనట్టు వ్యవహరిస్తూ.. కార్పొరేట్ బుద్ధిని చూపిస్తున్నాయి.
అయితే తాజాగా.. ఓ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగింది. హైదరాబాద్ - తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో టేకాఫ్ తర్వాత పైలెట్ సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో తిరిగి వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను దింపి సాంకేతిక లోపాన్ని పరీశీలిస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాస్తున్నారు. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి:
రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగే
భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం