Share News

Surrogacy Case: మేడ్చల్ సరోగసి కేసును సుమోటోగా తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు..

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:54 PM

ఆగస్టు 14న పక్కా సమాచారంతో సరోగసి జరుగుతున్న ఓ ఇంట్లో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోదాల సమయంలో సరోగేట్ తల్లులతో పాటు వివిధ ఫెర్టిలిటీ హాస్పిటల్లకు చెందిన డాక్యుమెంట్స్‌ని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.

Surrogacy Case: మేడ్చల్ సరోగసి కేసును సుమోటోగా తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు..
Surrogacy

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సరోగసి కేసులు వేల సంఖ్యలో వెలుగులోకి వస్తుండటం, అటూ అధికారులను, ప్రజలను ఆశ్యర్యానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ.. ముందుకు దూసుకెళ్తున్నారు. తాజాగా మేడ్చల్ సరోగసి కేసును సుమోటో కేసుగా తీసుకుని పేట్ బషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీఎన్ఎస్ 318(4), 61(2) యాక్ట్ కింద రెండు కేసులు.. ART యాక్ట్ కింద రెండు కేసులతో పాటు సరోగసి యాక్ట్ కింద 4 కేసులు నమోదు చేశారు పోలీసులు.


విస్తుపోయే విషయాలు..

ఆగస్టు 14న పక్కా సమాచారంతో సరోగసి జరుగుతున్న ఓ ఇంట్లో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోదాల సమయంలో సరోగేట్ తల్లులతో పాటు వివిధ ఫెర్టిలిటీ హాస్పిటల్లకు చెందిన డాక్యుమెంట్స్‌ని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. ఎల్ఎల్‌హెచ్ ఫెర్టిలిటీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిందితురాలు లక్ష్మి దందాను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదట్లో నిందితురాలు లక్ష్మీ ఏజెంట్గా పనిచేసినట్లు గుర్తు చేశారు.


ప్రెగ్నెన్సీ లేడీలకు ఐదు నుండి ఆరు లక్షలు..

1994లో నిందితురాలు లక్ష్మికి వివాహం జరిగింది. వ్యక్తిగత కారణాలవల్ల భర్తతో 26 సంవత్సరాల నుంచి వేరుగా ఉంటున్నట్లు వివరించారు. లక్ష్మికి కొడుకు నరేందర్ రెడ్డితో పాటు ఒక కూతురు ఉన్నట్లు తెలిపారు. ఏజెంట్గా వ్యవహరించి ఆ తర్వాత 2022లో కూకట్పల్లిలోని ఫెర్టిలిటీ సెంటర్‌కు మొదటిసారి లక్ష్యి ఎగ్ డొనేట్ చేసినట్లు గుర్తించినట్లు వివరించారు. తర్వాత కాంటాక్ట్స్ పెంచుకొని సరోగేట్ లేడీస్‌ను తయారు చేయడం మొదలు పెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రెగ్నెన్సీ లేడీలకు ఐదు నుండి ఆరు లక్షలు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. లక్ష్మికి పలు ఫర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గత 20 సంవత్సరాల నుంచి ఏజెంట్‌గా.. ఎగ్ డొనరుగా నిందితురాలు లక్ష్మి వ్యవహరిస్తుందన్న మొదలగు అంశాలను ఎఫ్ఐఆర్ కాపీలో పొందుపరిచినట్లు పోలీసులు స్పష్టం చేశారు.


బాగోతం బయటపడింది..

కర్ణాటకకి చెందిన మహిళ భర్త ఫిర్యాదుతో లక్ష్మిరెడ్డి భాగోతం బయటపడింది. కర్ణాటకకి చెందిన మహిళకు రెండు కిడ్నీలు పాడైన విషయం లక్ష్మికి తెలిసింది. ఆ మహిళను కలిసి కిడ్నీ ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బులు తాను ఇస్తానని, అయితే ఆరోగ్యం కుదుటపడ్డాక సరోగసి ద్వారా తనకు బిడ్డను కని ఇవ్వాలని డీల్ కుదుర్చుకుంది. ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం కుదుటపడటంతో సరోగసి కోసం సదరు మహిళను లక్ష్మిడి సంప్రదించింది. అయితే ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో గొడవ మొదలైంది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మి బాగోతం బయటపడింది.


ఇవి కూడా చదవండి

మీరు ఇంత ప్రత్యేకమా.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సూర్యుడిలో విస్ఫోటనాలు.. మనుషులపై తీవ్ర ప్రభావం..

Updated Date - Aug 17 , 2025 | 04:54 PM