Union Minister Kishan Reddy : హైదరాబాద్ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ABN , Publish Date - Aug 28 , 2025 | 05:34 PM
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. భారత హోమ్ మంత్రిత్వ శాఖ దీనిపై మానిటరింగ్ చేస్తుందన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 28 : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. భారత హోమ్ మంత్రిత్వ శాఖ దీనిపై మానిటరింగ్ చేస్తుందన్నారు. రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కేంద్రం అన్ని జిల్లాల వారీగా అందుబాటులో ఉంచిందని చెప్పారు. తాను ఎప్పటికప్పుడు కేంద్రానికి అన్ని విషయాలు చెప్తున్నానని, ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో జాతీయ రహదారులు దెబ్బతిన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. 'పలుచోట్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. వీటన్నిటి రెగ్యులర్ గా మరమత్తులు చేసేలా చూస్తున్నాం. మరో రెండు రోజులు భారీగా వర్షాలు ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ఉండాలి. హైదరాబాద్ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యవస్తంగా ఉంది. వాటర్ వర్క్స్ డిపార్మెంట్ లో నిధులు లేనందున చిన్న చిన్న పనులు కూడా కావడం లేదు.' అని కిషన్ రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి