Fire Accident In Old City: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ABN , Publish Date - Nov 25 , 2025 | 07:33 AM
పాతబస్తీలోని ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 25: పాతబస్తీ శాలిబండలోని ఒక ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్థరాత్రి లాల్ దర్వాజ క్రాస్ రోడ్డు సమీపంలోని ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన వారు ఘటన స్థలానికి చేరుకుని.. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ రెండు అంతస్తుల్లో ఉంది. అందులో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ఈ మంటల దాటికి రిఫ్రిజరేటర్లలోని గ్యాస్ సిలిండర్లు సైతం పేలాయి. ఈ పేలుడుకు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక భారీగా ఎగసిపడిన మంటలు.. పక్కనున్న దుకాణాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను వారు అన్వేషిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొన్ని కోట్ల రూపాయిల మేర ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు సీఎం అభినందనలు
For More TG News And Telugu News