Share News

Hyderabad Gym Incident: కాసేపట్లో జిమ్ ఓపెనింగ్... కానీ అంతలోనే

ABN , Publish Date - Oct 17 , 2025 | 10:08 AM

సందడిగా, ఉత్సాహంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంతో కష్టపడి జిమ్‌ను సిద్ధం చేసి కాసేపట్లో ప్రారంభోత్సవం జరుగుతుందని భావించిన జిమ్ ఓనర్‌కు పెద్ద షాక్ తగిలింది.

Hyderabad Gym Incident: కాసేపట్లో జిమ్ ఓపెనింగ్... కానీ అంతలోనే
Hyderabad Gym Incident

హైదరాబాద్, అక్టోబర్ 17: జిమ్ ఓపెనింగ్ (Hyderabad Gym Incident) సందర్భంగా అప్పటి వరకు ఆ ప్రాంగణమంలో సందడి నెలకొంది. మరికొద్దిసేపట్లో జిమ్ ఓపెనింగ్‌కు అంతా సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చి జిమ్‌ను ప్రారంభం చేయనుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు జిమ్ ఓనర్. కానీ అంతలోనే అక్కడ పెను విషాదం చోటు చేసుకుంది. సందడిగా, ఉత్సాహంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంతో కష్టపడి జిమ్‌ను సిద్ధం చేసి కాసేపట్లో ప్రారంభోత్సవం జరుగుతుందని భావించిన జిమ్ ఓనర్‌కు పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ జరిగిందో ఇప్పుడు చూద్దాం.


నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోట్‌లో విషాదం చోటు చేసుకుంది. జిమ్ ఓపెనింగ్‌ కోసం లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిమ్ ఓనర్ రాకేష్.. తన జిమ్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను ఆహ్వానించారు. కాసేపట్లో ఎమ్మెల్యే వస్తారని సమాచారం అందడంతో డిజైనింగ్ లైట్లు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు సిబ్బంది. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.


లైట్లు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగడంతో శివ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శివ డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిమ్ ఓనర్ రాకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిమ్ ఓపెనింగ్ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.


ఇవి కూడా చదవండి...

భార్యపై కోపం.. అత్తింటిని తగలబెట్టిన భర్త.. ఏమైందంటే?

ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 17 , 2025 | 10:18 AM