Share News

Nanda Kumar: రక్షణ ఇవ్వండి.. నిజాలు బయటపెడతా.. ఫోన్ ట్యాపింగ్‌పై నందకుమార్

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:05 PM

Nanda Kumar: ఫోన్ ట్యాపింగ్‌పై నంద కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేయకుండా తనకు సంబంధించిన ఆడియోలు మాజీ సీఎం కేసీఆర్‌కు ఎలా దొరికాయని నిలదీశారు.

Nanda Kumar: రక్షణ ఇవ్వండి.. నిజాలు బయటపెడతా.. ఫోన్ ట్యాపింగ్‌పై నందకుమార్
Nanda Kumar

హైదరాబాద్, జూన్ 4: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌పై(Phone Tapping) ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నంద కుమార్ (Nanda kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు.2022 ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు నందకుమార్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన ఫోన్‌ కూడా ట్యాప్ అయ్యిందని.. ఈ విషయంపై అప్పటి డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలుద్దామని అనుకున్నానని.. కానీ అపాయింట్‌మెంట్ దొరకలేదని అన్నారు. ఈరోజు (బుధవారం) ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో నందకుమార్ మాట్లాడుతూ.. అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చెబితేనే తన ఫోన్ టాప్ చేసినట్టు రాధా కిషన్ రావు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్‌లో చెప్పారన్నారు.


తన ఫోన్ ట్యాప్ చేశారని రాధా కిషన్ రావు స్టేట్‌మెంట్‌తో క్లియర్‌గా తేలిందన్నారు. పక్కా సమాచారం ఉన్నా పోలీసులు ఆధారాల కోసం మూసీలో వెతికారన్నారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఎవరికి ఫిర్యాదు చేయాలో వాళ్లకి చేస్తానని.. తన ఫోన్ ట్యాప్ చేయడానికి ఇంటలిజెన్స్ అధికారులు ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాప్ చేయకుండా తనకు సంబంధించిన ఆడియోలు మాజీ సీఎం కేసీఆర్‌కు (Former CM KCR) ఎలా దొరికాయని నిలదీశారు. తాను రోహిత్ రెడ్డి మాట్లాడిన మాటలు కాల్ రికార్డింగ్ కావచ్చని.. కానీ సింహయాజి స్వామితో మాట్లాడిన కాల్స్ కూడా రికార్డింగేనా అని అడిగారు. ఫాం హౌస్ కేసు స్టేట్ సెంట్రల్ ఇష్యూ అని.. అందులో తాను బలైనట్లు తెలిపారు.


ప్రభాకర్ రావు వచ్చినా కూడా న్యాయం జరగదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేస్ ఎప్పుడో అయిపోయిందని.. జస్ట్ ఫార్మాలిటీస్ కోసం ప్రభాకర్ రావు ఇండియా వస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ తానే చేయించాను అని ప్రభాకర్ రావు అంగీకరిస్తే కేసు అక్కడితో ముగుసినట్టే అని అన్నారు. ‘నాకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు, మాజీ సీఎం కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కల్పిస్తే చాలా విషయాలు బయటపెడతా’ అని నందకుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

నిర్మానుష్య ప్రదేశంలో బ్యాగ్.. తెరిచి చూస్తే షాక్

మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 04:05 PM