Nalgonda NHRC: గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ.. పోలీసు అధికారులపై వేటు
ABN , Publish Date - Oct 10 , 2025 | 07:03 PM
విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీసులపై చర్యలు తీసుకుంది. సాయి సిద్దుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
నల్గొండ: దామరచర్ల మండలం వాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యూరియా కోసం ధర్నా చేసినందుకు గిరిజన రైతు సాయి సిద్దును పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన విషయం తెలిసిందే. అయితే అతనిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, సాయి సిద్దు భార్యను కులం పేరుతో దూషించారని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సామాజికవేత్త రేవంత్ ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీసులపై చర్యలు తీసుకుంది. సాయి సిద్దుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఎస్పీకి మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటనపై వెంటనే ఉన్నత స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..