Nagole Husband Wife Incident: నాగోల్‌లో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త
ABN , Publish Date - Sep 14 , 2025 | 02:10 PM
నాగోల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త అతి క్రూరంగా భార్య గొంతు కోశాడు. ప్రస్తుతం, భార్య పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్: నాగోల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త అతి క్రూరంగా భార్య గొంతు కోశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు హుటాహుటినా ఆమెను నాగోల్ లోని సుప్రజ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలేం జరిగిందంటే..
గత యాడాది క్రితమే మహాలక్ష్మి(20) అనే యువతికి వేణుగోపాల్‌తో వివాహం జరిగింది. అయితే, అదనపు కట్నం తేవాలని పెళ్ళైన నెల నుండే భర్త తన భార్యను చితకబాదుతూ మానసికంగా హింసించడం ప్రారంభించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా భర్త తీరు మారలేదని అంటున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి తెలుసుకున్న వారి తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి పయనమయ్యారు. తమ కుమార్తెకు ఈ పరిస్థితికి కారణమైన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also Read:
జగన్‌కు అయ్యన్నపాత్రుడు చురకలు
వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలింది: జేపీ నడ్డా
For More Latest News