Minister Venkat Reddy: కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో క్షుద్ర పూజలు చేశారు.. మంత్రి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 07:14 PM
మాజీ సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అసలు అద్భుతమే కాదని విమర్శించారు. కాళేశ్వరం నివేదిక రావడంతో.. బీఆర్ఎస్ నాయకులు నోళ్లు మెదపడం లేదని పేర్కొన్నారు. నివేదికతో బీఆర్ఎస్ బాగోతం బట్టబయలైందని తెలిపారు.
హైదరాబాద్: ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం తన మీద కోపం SLBC మీద చూపిస్తుందని ఆరోపించారు. SLBC కూలిపోవాలని కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో క్షుద్ర పూజలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 43 కిలోమీటర్లు ఉన్న SLBC టన్నెల్ ఓ అద్భుతమని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అసలు అద్భుతమే కాదని విమర్శించారు. కాళేశ్వరం నివేదిక రావడంతో.. బీఆర్ఎస్ నాయకులు నోళ్లు మెదపడం లేదని పేర్కొన్నారు. నివేదికతో బీఆర్ఎస్ బాగోతం బట్టబయలైందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడానికి బీఆర్ఎస్ నాయకులు కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పై నమ్మకంతోనే ప్రజలు ఎన్నికల్లో గెలిపించారని స్పష్టం చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ విలీనంపై కేసీఆర్ అత్యవసర సమావేశం..!
కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది