Share News

Chiru on TG Rising Global Summit: ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా సహకరిస్తాం: మెగాస్టార్

ABN , Publish Date - Dec 09 , 2025 | 09:25 PM

ఫ్యూచర్ సిటీలో రెండో రోజు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదో గొప్ప సమ్మిట్ అని కొనియాడిన చిరు.. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా సహకరిస్తామని ఈ సందర్భంగా అన్నారు.

Chiru on TG Rising Global Summit: ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా సహకరిస్తాం: మెగాస్టార్
Chiranjeevi Participated in TG Rising Global Summit

హైదరాబాద్, డిసెంబర్ 09: ఫ్యూచర్ సిటీలో రెండో రోజు జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(TG Rising Global Summit)లో టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పాల్గొన్నారు. తనపై గౌరవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని ఈ సందర్భంగా మెగాస్టార్ గుర్తుచేశారు. సీఎం కోరిక మేరకు ఎంతో ఆనందంగా ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఇదో గొప్ప సమ్మిట్ అని కొనియాడారు చిరు.


అప్పుడే భట్టీ వచ్చారు..

ఈ సమ్మిట్ కోసం ఆహ్వానించేందుకు భట్టి విక్రమార్క తన వద్దకు వచ్చారని చిరు పేర్కొన్నారు. సినిమా షూటింగ్ సందర్భంగా ఆ సమయంలో తాను హీరోయిన్‌తో డ్యాన్స్ చేస్తూ ఉన్నానని చెప్పుకొచ్చారాయన. 'గొప్ప సమ్మిట్ ఇది. తెలంగాణ రైజింగ్ కొత్త ఇనిషియేటివ్. చాలా ఆనందంతో ఇక్కడికి వచ్చాను. చిరంజీవిని ఒక్కడినే ఇక్కడ కూర్చోబెట్టారని ఎవరూ అనుకోవద్దు. సినిమా సొసైటీ గురించి తెలిసిన వ్యక్తిగా నన్ను ఆహ్వానించారు. పరిశ్రమ మనిషిగా మాత్రమే ఇక్కడకు వచ్చాను. హైదరాబాద్‌(Hyderabad)ను ఫిలిమ్ గ్లోబల్ హబ్‌గా చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి ఎంతో ధైర్యంగా నాతో చెప్పారు' అని మెగాస్టార్ అన్నారు.


ఫ్యూచర్ సిటీకి అన్ని రకాల సెక్టార్లను ఆహ్వానించడం రేవంత్ రెడ్డి ఒక్కరికే సాధ్యమైందని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. తెలంగాణాలో అన్ని వనరులు ఉన్నాయని.. ప్రపంచానికి హైదరాబాద్ సినిమా హబ్‌(Cinema Hub)గా మార్చేందుకు తామంతా సీఎం వెంట ఉంటామని హామీ ఇచ్చారు. యువతను గురించి మాట్లాడుతూ.. ఎంటర్‌టైన్మెంట్ వైపునకు మళ్లిస్తే వ్యసనాలకు దూరమయ్యే అవకాశముందన్నారు. సరైన మౌలిక వసతులను కల్పిస్తే సినీ పరిశ్రమ గ్లోబల్ హబ్‌(Global Hub)గా మారుతుందని చిరు వివరించారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా తాము సహకరిస్తామని ఫ్యూచర్ వేదికగా ప్రకటించారు మెగాస్టార్.


ఇవీ చదవండి:

ఇండిగో సేవలు గాడిన పడుతున్నాయి.. మమ్మల్ని క్షమించండి: సీఈఓ

ఆర్ఎస్ఎస్ ఎజెండాను ప్రభుత్వం అమలు చేస్తోంది... ఎస్ఐఆర్‌పై చర్చలో రాహుల్

Updated Date - Dec 09 , 2025 | 09:36 PM