Share News

Meenakshi Natarajan: నా బ్యాగులు మోయవద్దు.. స్టేషన్‌కు రావొద్దు

ABN , Publish Date - Feb 28 , 2025 | 07:51 PM

Meenakshi Natarajan: టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి ప్రచారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ స్వాత్రంత్యం కోసం పోరాటం చేసిందని గుర్తు చేశారు. అలాగే ఫ్లెక్సీలు, బ్యానర్లు పెడితే ఏ నాయకుడు గెలవరన్నారు.

Meenakshi Natarajan: నా బ్యాగులు మోయవద్దు.. స్టేషన్‌కు రావొద్దు
Telangana Congress Incharge

హైదరాబాద్, ఫిబ్రవరి 28: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఎంతో పోరాట శక్తి ఉందని.. గతంలో అనేక రకాలుగా పోరాటాలు చేశామని.. అందుకే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో గాంధీభవన్‌లోని టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. మనం ప్రభుత్వంలో ఉన్నాం.. పేదవాడి కోసం పని చేయాలి.. తద్వారా పేదల ముఖంలో నవ్వులు చూడాలని.. అలా అయితేనే మనం పని చేసినట్లు అవుతోందని తెలిపారు.

Also Read: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు


లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జోడో యాత్ర నిర్వహించారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలతో మనం పోరాటం చేయవలసి ఉందన్నారు. దేశం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ.. స్వాతంత్రాన్ని తెచ్చిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉందని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.

Also Read: బెదిరిస్తే బెదరడానికి ఎవరూ లేరు


రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందించాలని నేతలకు సూచించారు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేసారన్నారు. వారికి న్యాయం జరగాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. మనం చేసిన పనులను ప్రజలకు సైతం వివరించాలన్నారు.

Also Read: భవిష్యత్తులో ఏపీలో రాబోయే మార్పులు చెప్పిన పవన్


ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కుల గణన చేపట్టామని వివరించారు. ఇది చాలా గొప్ప విషయమన్నారు. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు. గ్రామ గ్రామన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ విషయంలో పీసీసీ పకడ్బందీగా అమలు చేసేలా ఓ కాలెండర్‌ను సిద్ధం చేయాల్సి ఉందన్నారు.

Also Read: మీరు ప్రయాణిస్తున్న రైలులో ఛార్జింగ్ సాకెట్ పనిచేయడం లేదా.. ఇలా చేస్తే క్షణాల్లో ..


ఫోన్ చేస్తే కార్యకర్తలతో సైతం తాను మాట్లాడతానని ఈ సందర్బంగా మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఫ్లెక్సీ, ఫోటోలు పెడితే ఎన్నికల్లో నాయకులు గెలవరని.. ప్రజల్లో ఉంటేనే గెలుస్తారని తెలిపారు. మనం ఎలాంటి ప్రచారాలు లేకున్నా గతంలో స్వాతంత్ర్య పోరాటంలో గెలిచామని గుర్తు చేశారు. తన కోసం రైల్వే స్టేషన్లకు రావద్దంటూ పార్టీ నేతలకు ఈ సందర్బంగా సూచించారు.

Also Read: Fact Check : రూ.3 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. కొందామనుకొంటున్నారా


అలాగే తన బ్యాగులు సైతం ఎవరూ మోయవద్దన్నారు. అతనకు బలం లేకపోతే... మీ సహాయం అడుగుతానని ఈ సందర్భంగా పార్టీ నేతలకు తెలిపారు. మీ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తక్కువ చేసుకోవద్దని.. మీ పని మీరు చేసుకోండంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు.

For Telangana News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 07:52 PM