Medhapatkar: హైదరాబాదులో మేధాపాట్కర్.. అడ్డుకున్న పోలీసులు..
ABN , Publish Date - Mar 03 , 2025 | 11:24 AM
సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ సోమవారం హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. మూసీ సుందరీకరణ ప్రాంత పరిశీలనకు ఆమె వెళ్లనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆమె ఉండే ప్రాంతానికి వెళ్లారు.

హైదరాబాద్: సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ (Social Activist Medha Patkar) హైదరాబాద్ (Hyderabad)లో ప్రత్యక్షమయ్యారు. చాదర్ ఘాట్‌లో ఒక ఇంటికి వచ్చారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు (Police) ఆమె ఉన్న ఇంటి వద్దకు వచ్చారు. అయితే ఆమె మూసీ (Musi) సుందరీకరణ ప్రాంతానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో పోలీసులు మేధాపాట్కర్‌ను అదుపులోకి తీసుకొని పంపించివేశారు. తాను తన ఫ్రెండ్స్ ఇంటికి మాత్రమే వచ్చానని మేధాపాట్కర్ చెప్పినా పోలీసులు వినలేదు. ఈ ప్రాంతంలో ఉండవద్దంటూ ఆమెను పోలీసులు పంపించి వేశారు.
Read More..: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు
కాగా సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. మూసీ సుందరీకరణ ప్రాంతానికి ఆమె వెళ్లనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మేధాపాట్కర్ ఉండే ప్రాంతానికి వెళ్లారు. ఆమెను అదుపులోకి తీసుకుని అనేక ప్రశ్నలు వేశారు. ఈ ప్రాంతంలో ఎవరూ ఉండకూడదని వెళ్లిపోవాలన్నారు. కాగా నర్మదా బచావో అనే నినాదంతో మేధాపాట్కర్ ఓ పర్యావరణ ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమంలో భాగంగా ఆమె హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై రఘురామ స్పందన..
జీఎంసీ బాలయోగికి మంత్రి లోకేష్ నివాళి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News