మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై రఘురామ స్పందన..
ABN, Publish Date - Mar 03 , 2025 | 10:39 AM
రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడను పూర్తిచేయాలంటే సుమారు రూ. 3 వేల కోట్లు అవుతుందని, మనబడి మన భవిష్యత్తు, ఉపాధి హమీ కింద దశలవారీ చేపడుతామని మంత్రి లోకేష్ చెప్పారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే క్యాంపెయిన్ ఈ ప్రభుత్వం చేపట్టిందన్నారు.
అమరావతి: మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అసెంబ్లీ (Assembly)లో చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ప్రశంసించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు చాలా చక్కగా సమాధానం చెప్పారన్నారు. తన నియోజక వర్గంలో స్కూళ్ల బయట షాపుల సమస్యకు ఎమ్మెల్యేలు అందరూ భాగస్వాములు కావాలని మంత్రి బాగా చెప్పారని అన్నారు.
Read More: సునీల్ కుమార్ నాయక్ విచారణ
మంత్రి నారాలోకేష్ వ్యాఖ్యలు..
రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడను పూర్తిచేయాలంటే సుమారు రూ. 3 వేల కోట్లు అవుతుందని, మనబడి మన భవిష్యత్తు, ఉపాధి హమీ కింద దశలవారీ చేపడుతామని మంత్రి లోకేష్ చెప్పారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే క్యాంపెయిన్ ఈ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రతి పాఠశాలలో ఈగల్ టీంలు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కాలేజీలకు, పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌లో స్టార్ రేటింగ్ ఆధారంగా మౌళిక సదుపాయాలు, మంచి విద్య అందించడంలో ప్రణాళికలు వేస్తున్నామని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జీఎంసీ బాలయోగికి మంత్రి లోకేష్ నివాళి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Mar 03 , 2025 | 10:39 AM