Fire Accident:హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - May 15 , 2025 | 10:32 AM
Fire Accident:హైదరాబాద్, అఫ్జల్ గంజ్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్‌లోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో సుమారు 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: నగరంలో తరచుగా అగ్ని ప్రమాదాలు (Fire Incidents) జరుగుతున్నాయి. చందానగర్ (Chandanager)లో నాలుగు రోజుల క్రితం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.సెంట్రో భవనం (Centro Building)లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు భవనమంతా వ్యాపించాయి. ప్రధాన రహదారిపై ఉన్న ఈ బిల్డింగ్‌లో మంటలు ఎగిసి పడడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా గురువారం ఉదయం అఫ్జల్ గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్ (Maharaj Ganj)లోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో సుమారు 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఈ మంటలు పక్కన ఉన్న ప్లాస్టిక్ గోదాముకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
మంటల్లో చిక్కుకున్న పది మంది..
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంతో చుట్టు ప్రక్కల నివాశితులు భయంతో రోడ్డు మీదకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి నష్టం ఏ మేరకు జరిగింది తెలియరాలేదు.
Also Read: అనంతపురంలో మంత్రి నారా లోకేష్ పర్యటన
మూడంతస్తుల భవనంలో మంటలు...
ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్న ఆరుగురిని బయటకు తీసుకొచ్చారు. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగగా.. మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోదాము, రెండవ అంతస్తులో యజమాని నివాసం, మూడో అంతస్తులో మరో కుటుంబం అద్దెకు ఉంటోంది. స్క్రాప్ గోదాంలో ఎగసిపడి మూడంతస్తులకు మంటలు వ్యాపించాయి. మంటలలో చిక్కుకున్న తల్లిని, నెలల పసికందును బ్రాండో స్కైలిప్ ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలోంచి బయటకు తీసుకువచ్చారు. కిటికీ అద్దాలు పగలగొట్టి నిచ్చెన ద్వారా మంటలలో చిక్కుకున్న ఇద్దరిని రక్షించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఘటన స్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే రాజాసింగ్.. పరిస్థితిని సమీక్షించారు.
ఢిల్లీలో అగ్ని ప్రమాదం..
మరోవైపు ఢిల్లీలోని పితంపురలోని శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఉదయం లైబ్రరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమానపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం జలక్.. ఎందుకంటే..
సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
For More AP News and Telugu News