Maoist Leader Surrender: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ... మరో కీలక నేత సరెండర్
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:09 AM
మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నేత కూడా పోలీసులకు సరెండర్ అయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్ 28: మావోయిస్ట్ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అనేక మంది మావోయిస్టు కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న విషయం తెలిసిందే. వీరి బాటలోనే మరి కొందరు కీలక నేతలు కూడా నడుస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ ముఖ్యనేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ (Maoist Leader Bandi Prakash) పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈరోజు (మంగళవారం) తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivadhar Reddy) సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు.
బండి ప్రకాష్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. 1982-84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా ఆర్ఎస్‌యూ తరఫున పోరాడారు. ఆపై మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్ బండి ప్రకాష్. దాదాపు 45 సంవత్సరాలుగా సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలలో రాష్ట్ర కమిటీ సభ్యుడుగా పనిచేసిన ప్రకాష్ పోలీసుల ఎదుట లొంగపోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బే అని చెప్పుకోవాలి.
ఇవి కూడా చదవండి...
మూసీ అభివృద్ధిలో మరో కీలక అడుగు..
రైలు, విమాన సర్వీసులకు బ్రేక్
Read Latest Telangana News And Telugu News