Maoists: మరోసారి విరుచుకుపడిన మావోలు.. పోలీస్ వాహనం పేల్చి..
ABN , Publish Date - Jun 09 , 2025 | 10:46 AM
సుక్మా జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొంట - గొల్లపల్లి రోడ్డులో మరోసారి విరుచుకుపడ్డారు. ఐఇడీని పేల్చివేయడంతో కొంట అదనపు ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే మృతిచెందారు.
ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లాలో (Sukma District) మావోయిస్టులు దుశ్చర్యకు (Maoist Attack) పాల్పడ్డారు. కొంట - గొల్లపల్లి రోడ్డులో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. ఐఇడీ బాంబ్‌ని పేల్చివేయడంతో కొంట అదనపు ఏఎస్పీ ఆకాశ్‌రావు గిర్పుంజే (ASP Akash Rao Girpunje) మృతిచెందారు. నూతన బేస్ క్యాంప్ సమీపంలో బాంబు పేలుడు సంభవించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
సుక్మా జిల్లా కొంటా చిక్వార్ గూడ మైన్‌లో ప్రొక్లెయిన్‌కు మావోయిస్ట్‌లు నిప్పు పెట్టారు. ఈ విషయం తెలియడంతో విచారణ కోసం ఘటనా స్థలానికి ఏఎస్పీ ఆకాశ్‌రావు గిర్పుంజే చేరుకున్నారు. ఈ సమయంలోనే మావోయిస్ట్‌లు మాటు వేసి ఏఎస్పీ వాహనాన్ని ఐఇడీ బాంబుతో పేల్చడంతో ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఏఎస్పీని స్థానిక ఆస్పత్రిలో వైద్యం కోసం తరలించారు. హాస్పిటల్‌లో ఏఎస్పీ ఆకాశ్‌రావు చికిత్స పొందుతూ మృతిచెందారు.
మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ అంత్యక్రియలు పూర్తి..
మరోవైపు.. చత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్‌లో ఐదురోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మృతిచెందారు. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు. అయితే సత్యవోలుకి ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకుని వచ్చారు. సుధాకర్ మృతదేహాన్ని బంధువులు, ప్రజలు సందర్శించి నివాళులు అర్పించారు.
ఆయన అంత్యక్రియలకు మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులు, మాజీ మావోయిస్టులు హాజరయ్యారు. వారు రావడంతో పోలీసుల నిఘా నీడలో సత్యవోలు గ్రామం ఉంది. సుధాకర్ అంతిమ యాత్రలో మావోయిస్టు సానుభూతిపరులు పాల్గొన్నారు. సుధాకర్ అంత్యక్రియలను ఆయన సోదరుడు అనందరావు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
హమీల అమలుకు బాబు సర్కార్ వ్యూహరచన
దేశంలో 6 వేలు దాటిన కొవిడ్ కేసులు
Read Latest Telangana News and National News