COVID-19: దేశంలో 6 వేలు దాటిన కొవిడ్ కేసులు
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:39 AM
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 6వేల మార్కును దాటి 6,133కు చేరుకుంది.
న్యూఢిల్లీ , జూన్ 8: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 6వేల మార్కును దాటి 6,133కు చేరుకుంది. గత 48 గంటల్లోనే ఏకంగా 769 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో 6 మరణాలు సంభవించాయి. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి మరణాల సంఖ్య 65కు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే కేరళలో కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సంసిద్ధతను పరిఽశీలించడానికి గాను మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News