TG News: వికారాబాద్‌లో వృద్ధురాలి దారుణ హత్య.. సంచలన విషయాలు వెలుగులోకి..
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:28 AM
మణికొండలో అదృశ్యమైన వృద్ధురాలు.. వికారాబాద్‌లో హత్యకు గురైంది. వృద్ధురాలి ఒంటిమీద ఉన్న నగల కోసం మరో మహిళా హత్య చేసింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

హైదరాబాద్: మణికొండలో(Manikonda) అదృశ్యమైన వృద్ధురాలు.. వికారాబాద్‌లో (Vikarabad) హత్యకు గురైంది. వృద్ధురాలి ఒంటిమీద ఉన్న నగల కోసం మరో మహిళా హత్య చేసింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు పోలీసులు వెల్లడించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్‌కి చెందిన బాలమ్మ ఈనెల(జూన్) 3వ తేదీన అదృశ్యమైంది. వాకింగ్‌కి వెళ్లిన బాలమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఆమె కోడలు ఫిర్యాదు చేసింది.
అనిత అనే తెలిసిన మహిళపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలమ్మ కోడలు ఫిర్యాదు చేసింది. ఈనెల 7వ తేదీన వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరులో అనితను నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనితను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలమ్మ ఒంటి మీద ఉన్న బంగారం, వెండి నగల కోసమే హత్య చేసినట్లు అనిత చెప్పింది. మృతదేహాన్ని కండ్లపల్లి అటవీ ప్రాంతంలో పడేసిట్లు అనిత పోలీసులకు తెలిపింది. 4వ తేదీన గుర్తు తెలియని మృతదేహాన్ని వికారాబాద్ జిల్లా చెన్‌గోముల్ పోలీసులు గుర్తించారు. స్పాట్‌లోనే పోస్ట్‌మార్టం నిర్వహించి అక్కడే ఖననం చేశారు. ఆ మృతదేహం బాలమ్మదని తేలడంతో.. 7వ తేదీన పోలీసులు బాలమ్మ మృతదేహాన్ని మళ్లీ వెలికితీశారు. బాలమ్మ మృతదేహంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. అనితపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
For More Telangana News and Telugu News..