Lionel Messi Hyderabad Visit: హైదరాబాద్‌కు మెస్సి.. ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద భారీ భద్రత
ABN , Publish Date - Dec 13 , 2025 | 03:34 PM
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా కాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
హైదరాబాద్: ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సి 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా ఇప్పటికే కోల్‌కతాలో పర్యటించిన ఆయన మరి కాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. శంషాబాద్ నుండి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్యాలెస్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మెస్సి ఆరుగంటల పాటు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉండనున్నారు. ప్యాలెస్‌లో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి మెస్సిని కలవనున్నారు. మరోవైపు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహూల్ గాంధీ కూడా రానున్నారు. అనంతరం ఏడు గంటలకు మెస్సితో కలిసి సీఎం రేవంత్, రాహుల్.. ఉప్పల్ స్టేడియంకు వెళ్లనున్నారు.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సి బస చేస్తూ ఉండడంతో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జాయింట్ సిపి తప్సీర్ ఇక్బాల్ భద్రత చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటికే ఫలక్నమ ప్యాలెస్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. వాటిపై ఫోకస్
వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..
Read Latest Telangana News and National News