KCR On Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. మృతులకు కేసీఆర్ సంతాపం
ABN , Publish Date - Oct 24 , 2025 | 09:17 AM
బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు కేసీఆర్. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం (Kurnool Bus Accident) తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రాష్ట్రపతి, ప్రధాని సహా ఏపీ సీఎం, మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతులకు సంతాపం తెలియజేశారు. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) కూడా ఈ ప్రమాదంపై స్పందిస్తూ మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాగా.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి అంతకంతకూ పెరిగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సులోనే పలువురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు మంటలను చూసిన వెంటనే అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. బైకు బస్సు కిందకు వెళ్లి డీజిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..
Read Latest Telangana News And Telugu News