Share News

Modi On Bus Accident: ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

ABN , Publish Date - Oct 24 , 2025 | 09:03 AM

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..

Modi On Bus Accident: ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
Modi On Bus Accident

కర్నూలు: కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరులో బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 20 మంది చనిపోయినట్లు సమాచారం. ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

అయితే, బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.


బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్..

బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

For More AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 01:42 PM